Posts

Latest AP political survey

  దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో ఆర్టీఐ కమీషనర్‌గా వ్యవహరించడమే కాకుండా..అనంతరం సాక్షి టీవీలో ఎడిటర్ స్థాయిలో పనిచేసిన దిలీప్ రెడ్డి ఇటీవల పీపుల్స్ పల్స్ పేరిట ఓ సంస్థ ప్రారంభించారు. ఆ సంస్థ తొలిసారిగా ఫస్ట్ ట్రాకర్ పోల్ సర్వే నిర్వహించింది. ఏపీలోని ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానాల్లో జరిపిన సర్వే ఇది. ఈ సర్వేలో ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి పీపుల్స్ పల్స్ సంస్థ ట్రాకర్ పోల్ పేరుతో జనవరి 16 నుంచి 21వ తేదీ మధ్యకాలంలో 35 పోలింగ్ స్టేషన్ల నుంచి 700 శాంపిల్స్ సేకరించారు. ప్రతి పోలింగ్ స్టేషన్ నుంచి 20 శాంపిల్స్ చొప్పున తీశారు. ఇందులో 53 శాతం పురుషులు కాగా 47 శాతం మహిళలున్నారు. ఎస్టీలు 45 శాతం కాగా, ఓబీసీలు 30 శాతం, ఓసీలు 15 శాతం ఎస్సీలు 6 శాతం ఉన్నారు. రాష్ట్రంలోని 7 ఎస్టీ నియోజకవర్గాల్లో చేసిన సర్వే అధికార పార్టీకు కాస్త ఇబ్బందిగానే కన్పిస్తోంది. ప్రతిపక్షాలు సంఘటితమైతే అధికార పార్టీకు ఇబ్బందిగా మారవచ్చు. ప్రతిపక్షాలు ఒంటరి పోరాటం చేస్తే మరోసారి వైసీపీదే ఆధిక్యం కానుంది. అయితే 2019 ఎన్నికలతో పోలిస్తే వైసీపీ ఈసారి దాదాపు 5 శాతం ఓట్లను కోల్పోనుంది. అదే సమయంలో 7 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గాన్